- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి జిల్లాకు ఆహార పరిశ్రమను ఏర్పాటు చేస్తాం: మంత్రి నిరంజన్ రెడ్డి
దిశ, వనపర్తి: తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఆహార పరిశ్రమను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇందు గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్వ ఆగ్రోటెక్, మార్క్ ఫెడ్ సేంద్రీయ ఎరువుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆహార పంటలు, ఉద్యాన పంటల సాగులో ఫర్టిలైజర్ వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను వినియోగించాలని అన్నారు. గత వంద సంవత్సరాలలో వ్యవసాయంలో ఫర్టిలైజర్ల వాడకం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నెలలో భూసారం గణనీయంగా తగ్గిపోవడం ద్వారా రానున్న 25 సంవత్సరాల ఆహార పంటలు పండించలేని ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.
ఫర్టిలైజర్ల వాడకం పరోక్షంగా మానవాళికి క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయన్నారు. శాస్త్రవేత్తల సూచన మేరకు వ్యవసాయ రంగంలో ఫర్టిలైజర్ల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా భావితరాలకు ఆరోగ్యవంతమైన నేలను అందించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్తులు అవ్వాలన్నారు. పంట మార్పిడి, జీవవైవిద్యంను రైతులు అలవర్చుకోవాలన్నారు. భావితరాలకు డబ్బును ఆస్తులను ఇవ్వడం కన్నా ఆరోగ్యవంతమైన నేలను ఇవ్వడం చాలా గొప్ప విషయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లాభాదాయక వ్యవసాయం అలవర్చడంలో భాగంగా వరి సాగు 25 రోజులు ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం, సేంద్రీయ ఎరువుల వాడకం, పంట మార్పిడి, వ్యవసాయంలో ఆధునీకరణ పద్ధతులను రైతులకు అవగాహనా కల్పించడం తెలంగాణ ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుందన్నారు.
వ్యవసాయ ఉద్యాన వన శాఖ అధికారులు ఇందుకు కృషి చేయాలని సూచించారు. ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్ లో ఫసల్ బీమా అమలు విషయంలో ఎందుకు వెనక్కి తగ్గారో చెప్పాలని రాష్ట్ర బీజేపీ నాయకులను ప్రశ్నించారు. ఫసల్ బీమా యోజన ద్వారా తెలంగాణ రాష్ట్రం 600 కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు. ఫసల్ బీమా పథకం బీమా కంపెనీల మేలుకే గానీ రైతులకు ఎటువంటి లాభం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ బోర్డ్ ఎండీ యాదిరెడ్డి, మార్క్ ఫెడ్ సీఈవో సుభాష్, మార్క్ ఫెడ్ డైరెక్టర్లు, కృషి విజ్ఞాన కేంద్రం కార్యక్రమ కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లక్ష్మయ్య, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సురేష్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, డీసీఎంఎస్ డైరెక్టర్లు ప్యాక్స్ చైర్మన్ లు, అభ్యుదయ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Read More: సిగ్గులేకుండా ఆ విషయం చెబుతున్నారా.. BRS ఎమ్మెల్సీపై ఆకునూరి మురళి సీరియస్