- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడగొడతాం: సంపత్ కుమార్
by Satheesh |

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో 30 శాతం కమీషన్ల ప్రభుత్వం నడుస్తుందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్పేర్కొన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ను ఓడగొడతామన్నారు. కాంగ్రెస్‌కు ఎదురులేదని, తప్పకుండా రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. కర్ణాటక స్ఫూర్తితో గెలుస్తామన్నారు. కర్ణాటకలో 40శాతం కమీషన్లు తీసుకున్న బీజేపీని ఓడించినామని, తెలంగాణలోనూ అదే జరుగుతుందన్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ కమీషన్ల గురించి మాట్లాడారని, దళిత బంధు విషయంలో అంగీకరించారన్నారు. ఎమ్మెల్యేల అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ అరాచకాలను త్వరలోనే బయటపెడతామన్నారు.
Next Story