- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గవర్నర్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: Minister Talasani Srinivas Yadav
దిశ, డైనమిక్ బ్యూరో: గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. నేడు రాజ్‌భవన్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు బాధాకరమన్నారు. రాజ్యాంగ హోదాలో ఉండి రిపబ్లిక్ డే రోజు అలా మాట్లాడటం సరికాదని అన్నారు. గవర్నర్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని మంత్రి తలసాని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకొని గవర్నర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు సీఎస్, డీజీపీ ని పక్కన పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. గురువారం సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదానికి గురైన డెక్కన్ మాల్ బిల్డింగ్ శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న భవనం కూల్చివేత పనులు సాయంత్రం నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఆలస్యమైనా కూల్చివేత పనులు సజావుగా జరిగేలా చూస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి: