- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TPCC Cheif : రెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తాం : టీపీసీసీ చీఫ్

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ(Congress MLC) అభ్యర్థిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC Cheif Mahesh Kumar Goud) కీలక ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. తమ అభ్యర్థిగా నలుగురు పేర్లు పరిశీలనలో ఉన్నాయన్న మహేష్ కుమార్ గౌడ్.. అల్ఫోర్స్(Alphors) విద్యాసంస్థల ఛైర్మన్ పేరు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు తమ సంపూర్ణ మద్ధతు ఉంటుందని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. కమిటీల్లో కష్టపడి పని చేసేవారికి ఈ నెలాఖరు లోగా పదవులు ఇస్తామని అన్నారు. జనవరి చివరి వారంలో కార్పొరేషన్ పదవులను భర్తీ చేస్తామని తెలిపారు. నేడు కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నాయకుడు డి.వి. సత్యనారాయణ రావు(DV Satyanarayana Rao)ను.. గాంధీ భవన్లో కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.