సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం!..ఆ విషయంలో కూడా ఈ సూత్రాన్నే వర్తింపజేయాలి.. హరీష్ రావు డిమాండ్

by Ramesh Goud |   ( Updated:2024-07-16 12:00:30.0  )
సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం!..ఆ విషయంలో కూడా ఈ సూత్రాన్నే వర్తింపజేయాలి.. హరీష్ రావు డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రేషన్ కార్డుకు ఆరోగ్య శ్రీ లింకు పెట్టవద్దని సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, రుణమాఫీ విషయంలో కూడా ఇవే వర్తింపజేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. ఆరోగ్య శ్రీ కార్డు జారీ చేసే విషయంలో ఆహర భద్రత కార్డుకు లింకు పెట్టవద్దని అందరికీ ఆరోగ్య శ్రీ కార్డులను జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. రేషన్ కార్డుకు ఆరోగ్య శ్రీ లింకు పెట్టవద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని అన్నారు. ఇదే సూత్రాన్ని రైతు రుణమాఫీకి వర్తింపజేయాలనీ రేషన్ కార్డు నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పాస్ బుక్ నే రుణమాఫీ కి ప్రామాణికంగా తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కాగా రుణమాఫీ నిబందనల పై హరీష్ రావు స్పందిస్తూ.. ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమేనని, ఎన్నికలప్పుడు మభ్య పెట్టి, అధికారం చేజిక్కినాంక ఆంక్షలు పెట్టారని సోమవారం ట్వీ్ట్ చేశారు.

Advertisement

Next Story