- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడాదిలోనే 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం : మంత్రి శ్రీధర్ బాబు
దిశ, పటాన్ చెరు/అమీన్ పూర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఏడాదిలోపే 50వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు భరోసా కల్పించిందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన పోలీస్ శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగ బాధ్యతలో ప్రవేశిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ మూడవ బ్యాచ్ పెరెడ్ కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుళ్ళ నుంచి ఓపెన్ టాప్ జీపులో అభివాదం చేస్తూ ఆయన గౌరవ వందనం స్వీకరించారు. 265 మంది కానిస్టేబుల్ శిక్షణలో బ్యాచ్ టాపర్లుగా నిలిచిన అభ్యర్థులకు మోడల్స్ తో పాటు ట్రోఫీ ని అందజేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దేశంలోనే తెలంగాణ పోలీసింగ్ అగ్ర స్థానంలో ఉందన్నారు. తెలంగాణ పోలీసులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి రాష్ట్ర ప్రతిష్టకు సంరక్షకులుగా నిలుస్తున్నారని కొనియాడారు. పోలీసు ఉద్యోగం సవాళ్లతో కూడినదని అకుంఠిత దీక్షతో పని చేస్తూ అత్యున్నత నైపుణ్యంతో ప్రజల భద్రతకు కృషి చేస్తున్నారన్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ గా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు కఠోర శిక్షణను పూర్తి చేసుకొని ప్రజల భద్రత కోసం ఉద్యోగంలో చేరుతుండడం సంతోషకరమన్నారు. మిమ్మల్ని చదివించి పెద్ద చేసి, ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఈ అపూర్వ ఘట్టం మీ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని నింపుతుందన్నారు. యూనిఫాం ఉద్యోగం నమ్మకానికి, బాధ్యతకు, పట్టుదలకు చిహ్నమని ఉద్యోగంలో చేరుతున్న కానిస్టేబుళ్ళంతా నిజాయితీగా పని చేయాలని సూచించారు.
తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అసెంబ్లీ, సెక్రటేరియట్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రాచీన దేవాలయాలు, బహుళార్థ సాధక ప్రాజెక్టులలో భద్రతను పర్యవేక్షిస్తుందని, ఉద్యోగంలో చేరుతున్న ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేసే తమ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వాములై ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరి సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ టీమ్ వర్క్ తో పనిచేసి ధైర్యసాహసాలతో తమ విధులు నిర్వర్తించాలని కోరారు.
ఈ సందర్భంగా తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో నియామకాలను పెంచాలని అడిషనల్ డీజీ (ఎస్పీఎఫ్) మంత్రి దృష్టికి తీసుకొని రాగా దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా, ఐజీ సత్యనారాయణ, సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్, టీజీ ఎస్పీఎఫ్ ప్రిన్సిపాల్ మాధవరావు, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, అమీన్ పూర్ సీఐ సదా నాగరాజు లతో పాటు టీజీఎస్పీఎఫ్ శిక్షకులు, సిబ్బంది, ఎంపికైన కానిస్టేబుల్ లో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.