- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రచారానికి ఎప్పుడైనా సిద్ధం.. అభ్యర్థి ఎంపికపై వారిదే తుది నిర్ణయం: కోమటిరెడ్డి

X
దిశ, వెబ్డెస్క్: మునుగోడులో ప్రచారానికి తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నికల అత్యంత కీలకంగా మారుతోంది. ఈ ఎన్నికలను ప్రతి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎలాగైనా గెలవాలని ప్రతి పార్టీ వ్యూహ రచనలు చేస్తున్నాయి. తాజాగా ఈ ఉప ఎన్నికలో ప్రచారానికి తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రకటించారు. ఎప్పుడు ఆదేశించినా ప్రచారానికి వెళ్తానని ఆయన తెలిపారు. అంతేకాకుండా మునుగోడులో పోటీ చేసే అభ్యర్థి విషయం భట్టి విక్రమార్కతో కలిసి చర్చించామని, కానీ తుది నిర్ణయం మాత్రం సోనియా, ప్రియాంక నిర్ణయం మేరకే అని ఆయన చెప్పుకొచ్చారు.
Next Story