- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
MLA Anirudh Reddy : సీఎం రేవంత్ రెడ్డికి మేం పిల్లర్లం : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం(Secret Meeting) రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారంపై ఇటు రాష్ట్ర నాయకత్వం నుంచి అటు ఢిల్లీ అధినాయకత్వం వరకు అంతటా తీవ్ర చర్చ జరిగింది. కొంతమంది నాయకులు జరగబోయే పరిణామాలు ఏమిటో కూడా అంచనా వేసే పనిలోకి దిగారు. కాగా ఈ రహస్య భేటీకి ముఖ్యుడుగా భావిస్తున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Jadcharla MLA Anirudh Reddy) సీక్రెట్ మీటింగ్ పై స్పందించారు. నగరం నడిబొడ్డున అందరం ఒకచోట కలిస్తే అది సీక్రెట్ మీటింగ్ ఎలా అవుతుంది అంటూ మండిపడ్డారు.
మా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై అంతా ఒకచోట కూర్చొని మాట్లాడుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆయా సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల కాలం తర్వాత మా పాలమూరు జిల్లా(Palamuru District) నుంచి రాష్ట్రానికి సీఎం అయ్యారని, ఆయనకు ఎల్లప్పుడూ పిల్లర్లలా(Pillors)గ ఉంటామని తెలియజేశారు. జడ్చర్ల చుట్టుపక్కల ఉన్న వేలాది భూదాన్ భూములన్నీ గత ప్రభుత్వంలోని నాయకులు "ధరణి"(Dharani) పేరుతో కొట్టేశారని ఆయన మండిపడ్డారు. దళితులు, ఎస్టీలకు, ఎస్సీలకు ఈ విషయంలో న్యాయం జరిగే వరకు తాను పోరాటం చేస్తానని వెల్లడించారు.
అయితే ఓ మంత్రి వ్యవహారం నచ్చక.. ఎమ్మెల్యే అనిరుధ్ నేతృత్వంలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్(Hyderabad) లోని ఓ హోటల్ లో రహస్యంగా భేటీ అయ్యారు. ఈ రహస్య మీటింగ్ విషయంపై రాష్ట్ర రాజకీయాలలో మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా జోరుగా చర్చకు దారి తీసింది. దీనిపై రాష్ట్ర నాయకులు స్పందిస్తూ.. అది సాధారణ సమావేశం, వారంతా డిన్నర్ కు కలిశారు అంటూ దాటవేసే ప్రయత్నం చేసినప్పటికీ.. కాంగ్రెస్ లో ఏదో జరుగుతోందనే విషయం బయటికి పొక్కింది. మరి ఈ సీక్రెట్ మీటింగ్ పై ఢిల్లీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.