- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
free bus scheme: ఫ్రీ టికెట్ వల్ల మాకు రెస్పెక్ట్ ఇస్తలే.. మహిళ వీడియో వైరల్
by Prasad Jukanti |

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకం రోజూ చర్చగా మారుతున్నది. ఈ స్కీమ్ వల్ల మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీంతో సీట్ల కోసం మహిళలు ఫైటింగ్, గొడవలు జరుగుతున్న సన్నివేశాలు నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ స్కీమ్ వల్ల తమను కండక్టర్లు, డ్రైవర్లు రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదని ఓ మహిళా ఆరోపించారు. గతంలో డబ్బులు ఇచ్చి టికెట్ కొనుగోలు చేసే వాళ్లమని దాంతో వాళ్లు మాకు రెస్పెక్ట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడేమో ఫ్రీ టికెట్ వల్ల ‘ఏ దిగు.. ఏ ఎక్కు. ఏ జరుగు..’ అంటూ రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదంటూ ఆమె చెప్పుకొచ్చారు. కండక్టర్లు, డ్రైవర్లతో పెద్ద ఇబ్బందిగా మారిందని ముందు వారిని సరిచేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story