- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిల్లింగ్ లో నిరంతరం కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న టీఎస్ఎన్పీడీసీఎల్..
దిశ, హనుమకొండ టౌన్ : భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా వరంగల్లో మే 2020లో కోవిడ్ సమయంలో సెల్ఫ్ మీటర్ రీడింగ్ ద్వారా టీఎస్ఎన్పీడీసీఎల్ బిల్లులను వినియోగదారులందరు స్వయంగా తమ సెల్ఫోన్ ద్వారా తీసుకునే విధంగా యాప్ డెవలప్ చేసి రీడింగు తీసుకున్నారు. ఆ యాప్ కోవిడ్ సమయంలో ఎంతో ఉపయోగకరంగా మారిందని సీఎండీ అన్నమనేని గోపాల్ రావు తెలిపారు. తెలంగాణలో ఆండ్రాయిడ్ బిల్లింగ్ ని టీఎస్ఎన్పీడీసీఎల్ ఆగష్టు 2021లో మొదటిసారిగ ప్రవేశ పెట్టారని, ఈ అండ్రాయిడ్ బిల్లింగ్ ద్వారా ప్రతి నెల దాదాపు 36 లక్షల వినియోగదారులకు ఈ విధానం ద్వారా బిల్లులు అందిస్తున్నామని తెలిపారు. బిల్లింగ్ లో 84% బిల్లింగ్ ఈ విధానం ద్వారానే చేస్తున్నామని అన్నారు.
ఆర్డీఏ మీటర్లకు ఓసీఆర్ (ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నజేషన్) టెక్నాలజీ ద్వారా బిల్లింగ్ మానవ ప్రమేయం లేకుండా నమోదు చేస్తారన్నారు. ఈ విధానం ద్వారా 16 రోజుల్లో వినియోగదారులకు అతితక్కువ సమయంలో మీటర్ రీడింగ్ తీసి బిల్లులు ఇస్తున్నారన్నారు. సకాలంలో బిల్లులు జారీ చేయడం ద్వారా వినియోగదారులందరు తమ బిల్లులను చెల్లింపు చేయడం ద్వారా రెవెన్యూ వసూళ్ళు ముందుగా ఎన్పీడీసీఎల్ కు అందుతున్నాయని తెలిపారు. ఈ విధానం ద్వారా మిషన్ నుండి మిషన్ ద్వారా మానవ ప్రమేయం లేకపోవడం వలన బిల్లింగ్లో తప్పులు దొర్లే అవకాశం లేదని, బిల్లింగ్ ఖచ్చితత్వం ఉంటుందని అన్నారు. సమయం ఆదా అవుతుందని, బిల్లుల జారీలో వినియోగదారులకు ఆలస్యం కాదని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్ఎన్పీడీసీఎల్) పరిధిలో గల హైవాల్యు వినియోగదారులకు నెలవారి బిల్లులు జారిచేయుటానికి కొత్త టెక్నాలజి ఉపయోగించడానికి టీఎస్ఎన్పీడీసీఎల్ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నామని సీఎండీ అన్నమనేని గోపాల్ రావు తెలిపారు. ఈ కొత్త టెక్నాలజీ ప్రకారం ఆప్టికల్ కేబుల్ ద్వారా మీటర్ రీడింగ్ మానవ ప్రమేయం ఏ మాత్రం అవకాశం లేకుండా స్మార్ట్ఫోన్ సహాయంతో రీడింగ్ నమోదుచేసి వినియోగదారులకు బిల్లులు జారీ చేస్తున్నారన్నారు. ఈ టెక్నాలజీ ప్రకారం రీడింగ్ నమోదులో ఎలాంటి తప్పులు దొర్లె అవకాశం లేదు, బిల్లుల జారీ ప్రక్రియ కూడా చాలా వేగంగా జరుగుతుందన్నారు. మొదటగా హన్మకొండ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ టెక్నాలజీ ప్రకారం బిల్లులు జారీ చేసిన తర్వాత ఈ టెక్నాలజీని ఎన్పీడీసీఎల్ కంపెనీ మొత్తానికి అమలు చేసే ఆస్కారముందని టీఎస్ఎన్పీడీసీఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్ రావు తెలిపారు.