రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదరించే వారే లేరు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Kalyani |
రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదరించే వారే లేరు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదరించే వారే లేరని, అడిగేవారు లేకనే ప్రభుత్వం కేసులు పెడుతుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు నాశనం చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదని, నిరుద్యోగుల విషయంలో మొహం చాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2018 నుంచి లైబ్రరీ పోస్టులను భర్తీ చేయడం లేదని ఆ విషయాన్ని ఎవరూ అడగటం లేదన్నారు. ప్రతి నెల మొదటి తేదీన జీతం తీసుకొనే ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులకు 10 తేదీ దాటిన తరువాత ఇస్తున్నారని అన్నారు. టీఎస్పీఎస్ కమిటీని పూర్తిగా రద్దుచేసి కొత్త కమిటీని వేసి వారం రోజుల్లో నోటిఫికేషన్ వేయాలని, లేకుంటే మహా పోరాటానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed