- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్ పరిధిలో హాత్ సే హాత్ జోడో యాత్రకు షెడ్యూలు ఖరారు
దిశ, హనుమకొండ టౌన్ : భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఏఐసీసీ ఆదేశాల మేరకు హాత్ సే హాత్ జోడో యాత్ర ఈ నెల 6 వ తేదీ నుండి ప్రారంభమైంది. అందులో భాగంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ములుగు నుండి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో హాత్ సే హాత్ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో శనివారం ఆ ముఖ్య నాయకులతో సమావేశమై నియోజకవర్గ వారీగా పాదయాత్ర షెడ్యులు ఖరారు చేశారు.
నియోజకవర్గ వారీగా పాదయాత్ర షెడ్యుల్ ...
ఫిబ్రవరి 14 వ తేదీన పాలకుర్తి , 15న వర్ధన్నపేట, 16 న స్టేషన్ ఘన్పూర్ , 17న వరంగల్ పశ్చిమ అండ్ తూర్పు నియోజకవర్గాలలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. 18,19 వ తేదీల్లో మహా శివరాత్రి సందర్భంగా విరామం తీసుకుంటూ, ఫిబ్రవరి 20న పరకాల, 21న భుపాలపల్లి నియోజకవర్గాలలో యాత్ర చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి సంభాని చంద్ర శేఖర్, శోభా రాణి, టీపీసీసీ ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, స్వర్ణ, ప్రధాన కార్యదర్శి దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, జనగామ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు జంగా రాఘవ రెడ్డి, భుపాలపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆయిత ప్రకాష్ రెడ్డి, పరకాల నియోజకవర్గ బాధ్యులు ఇనగాల వెంకట్రాం రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బాధ్యులు సింగాపురం ఇందిర, భూపాలపల్లి నియోజకవర్గ బాధ్యులు గండ్ర సత్యనారాయణ, వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యులు నమిండ్ల శ్రీనివాస్, మాజీ కేంద్రమంతి బలరాం నాయక్ పాల్గొన్నారు.