- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆయుష్ పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ షురూ
by D.Reddy |

X
దిశ, వరంగల్ ప్రతినిధి : రాష్ట్రంలో ఆయూష్ పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి హెల్త్యూనివర్శిటీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఐఏపీజీఈటీ-2021 పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులుగా ప్రకటించింది. పీజీ ఆయుర్వేదం, హోమియో, యునానీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 10న ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం యూనివర్శిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.
Next Story