ప్రారంభం అయిన కొద్దిసేపటికే నిలిచిపోయిన భద్రకాళి చెరువు పూడికతీత పనులు

by Mahesh |
ప్రారంభం అయిన కొద్దిసేపటికే నిలిచిపోయిన భద్రకాళి చెరువు పూడికతీత పనులు
X

దిశ, వెబ్ డెస్క్: వరంగల్ పట్టణంలో ఉన్న వరంగల్‌(warangal) భద్రకాళి చెరువు(Bhadrakali pond) ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా భద్రకాళి చెరువు(Bhadrakali pond)కు గండి కొట్టి.. చెరువులో నీటిని తొలగించి, పూడిక తీయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా.. కాపువాడ మత్తడి నుంచి అలంకార్‌ పెద్దమోరీ, కాకతీయ కాలనీ, పెద్దమ్మ గడ్డ మీదుగా నాగారం చెరువులోకి నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. కాగా 15-20 రోజుల్లో భద్రకాళి చెరువును ఖాళీ చేసి.. చెరువులో పూడిక తీత, గుర్రపుడెక్క తొలగింపు పనులు ప్రారంభించాలని అధికారులు భావించారు. ఇందులో భాగంగా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి.. పనులు ప్రారంభించిన కొద్దిసేపటికి అధికారులను మత్సకారులు(fishermen) అడ్డుకున్నారు. చెరువులో ఉన్నపలంగా నీటిని తీస్తే.. తమ ఆర్థిక వనరులు కోల్పోతామని చెరువులోని చేపల వేట (fishing)పై ఆధారపడిన మత్స్యకారులు వాపోయారు. తమకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసిన తర్వాత చెరువులో నీటిని తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు గండికొట్టే పనులను నిలిపేసిన అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Next Story