పది’ పరీక్షల ఫీజు.. డిసెంబర్ 5 వరకు గడువు పొడిగింపు

by Kalyani |   ( Updated:2024-11-29 09:35:00.0  )
పది’ పరీక్షల ఫీజు.. డిసెంబర్ 5 వరకు గడువు పొడిగింపు
X

దిశ, కాటారం : మార్చి-2025 లో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ / సప్లమెంటరీ విద్యార్థులు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా డిసెంబర్ 5వ తేదీ లోగా పరీక్షల ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి యం. రాజేందర్ తెలిపారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12వ తేదీ వరకు, రూ. 200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 19వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 30వ తేదీ వరకు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పరీక్ష ఫీజు చెల్లించ వచ్చునని తెలిపారు. పరీక్షల ఫీజు రూ.125గా నిర్ణయించామన్నారు. ఒకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ పరీక్ష ఫీజు తో పాటు 60 రూపాయలు అదనంగా కట్టాల్సి ఉంటుందని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు పట్టణాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.24 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేల లోపు ఉన్నట్లయితే తహసిల్దార్ ఇచ్చిన ఆదాయ ధ్రువపత్రం సమర్పిస్తే పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ప్రధానోపాధ్యాయులు సంబంధిత www.bse.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించి 10వ తరగతి పాఠశాల కోడ్ ద్వారా లాగిన్ అయి ఆన్లైన్లో విద్యార్థుల వివరాలను నమోదు చేయగలరని అన్నారు. పది పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా సుమారు 3526 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. రెండవ విడత ప్రకటించిన గడువు ఈనెల 28వ తేదీతో ముగియనుంది.

Advertisement

Next Story

Most Viewed