- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవకాశాలను అందిపుచ్చుకొని సమాజానికి సేవ చేయండి.. ఎమ్మెల్యే గండ్ర
దిశ, చిట్యాల : సమయం మన కొరకు ఆగదు, సమయం మన కొరకు వేచి ఉండదు, ఇచ్చినటువంటి సమయాన్ని అందిపుచ్చుకొని ఉద్యోగస్తులుగా గాని, ప్రజా ప్రతినిధులుగా గాని, ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగాలని, అదే విధంగా అవకాశం వచ్చినప్పుడు ఈ సమాజానికి సేవ చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండలంలో శనివారం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్( గర్ల్స్) లో కొత్త డైట్ మెనూను, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే కు పరేడ్ చేస్తూ, స్వాగతం పలికిన విద్యార్థినిలు, కాంగ్రెస్ నేతలు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో, భూపాలపల్లి నియోజకవర్గంలో అన్ని హాస్టల్లో, ఈ రోజు కొత్త డైట్ లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అన్ని హాస్టల్లో విద్యార్థులందరికీ, ఒకే రకమైన ఆహార మెనూ అమలు చేయడం హర్షనీయమన్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్య, కళాశాల ప్రిన్సిపాల్, డీసీఓ గోల్కొండ బిక్షపతి, మండల అధ్యక్ష కార్యదర్శులు గూట్ల తిరుపతి, కొమురయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీకృష్ణ, అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, వ్యవసాయ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి సత్యం, జిల్లా నాయకులు రాయకొమురు, టౌన్ అధ్యక్షులు లక్ష్మణ గౌడ్, యూత్ అధ్యక్షులు అల్ల కొండ కుమార్, రెబల్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.