- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లో ఉండి మాట్లాడే కవితకు అంత స్థాయి లేదు: రాము నాయక్
X
దిశ, నెల్లికుదురు: ప్రజల కష్టాలను చూడడానికి, వినడానికి వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలను విమర్శించే స్థాయి ఇంట్లో ఉండి మాటలు మాట్లాడే ఎమ్మెల్సీ కవితకు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ భిక్ష పెట్టిన మానుకోట ఎంపీ కవితలకు లేదని వైఎస్సార్ టీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగులోతు రాము నాయక్ అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ పాదయాత్రలో వస్తున్న ప్రజా స్పందనకు ఓర్వలేక షర్మిలపై టీఆర్ఎస్ గుండాలు చేసిన దాడిని సాటి మహిళలుగా ఖండించేది పోయి విమర్శలు చేయడం మహిళా లోకానికి అవమానమని అన్నారు. ఇప్పటికైనా షర్మిలపై దాడి చేసిన దుండగులను అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కల్వకుంట్ల కవిత, మాలోతు కవితలు ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఒత్తిడి తేవాలని రాము నాయక్ హితవు పలికారు.
Advertisement
Next Story