ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పడిన పిడుగు.. వ్యక్తికి తీవ్ర గాయాలు

by Mahesh |
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పడిన పిడుగు.. వ్యక్తికి తీవ్ర గాయాలు
X

దిశ, నెక్కొండ: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం వేకువజామున పిడుగులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వర్షం వస్తుండటంతో దీక్ష కుంట గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ధాన్యం పై పరదా కప్పడానికి గ్రామ రైతులు వెళ్లారు. ఈ క్రమంలో హఠాత్తుగా పిడుగు పడడంతో అనంతగిరి సతీష్ అనే రైతు తీవ్రగాయాల పాలయ్యాడు. గ్రామస్తులు అతన్ని ఆటోలో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. సతీష్‌కి చికిత్స అందిస్తున్నారు. మండలంలోని గుండ్రపల్లి గ్రామంలోని తాటి చెట్టుపై పిడుగు పడడంతో చెట్టు పూర్తిగా దగ్ధమైంది. అకాల వర్షాలకు తోడు పిడుగులు సైతం పడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story