గజం జాగా ముట్టలే.. ఒక్క రూపాయి అడగలే: ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

by Sumithra |
గజం జాగా ముట్టలే.. ఒక్క రూపాయి అడగలే: ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
X

వరంగల్ టౌన్: ఒక సామాన్యుడిగా ఉన్న తనను నాడు కార్పొరేటర్, మేయర్ గా, నేడు ఎమ్మెల్యేగా ఆశీర్వాదం ఇచ్చి గెలిపించిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కుతుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. గురువారం నియోజకవర్గంలోని దేశాయిపేట సికేఎం కాలేజ్ గ్రౌండ్ లో 12,22,23 డివిజన్ ల కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే నరేందర్ ఆత్మీయ సమ్మేళనం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఎంపీ పసునూరి దయాకర్,మాజీ ప్రభుత్వ విప్ బోడకుంట్ల వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ...కేసీఆర్ గారి ఆశీర్వాదంతో వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచామన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో సాధించిన తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. వరంగల్ లో 1000 కోట్లతో హాస్పిటల్,240 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్,కలెక్టరేట్, మోడ్రన్ కూరగాయల మార్కెట్,పండ్ల మార్కెట్,అద్భుతమైన సిసి రోడ్లు,కార్మిక భవనాలు,75కోట్లతో బస్ స్టేషన్,విద్యలో బాగంగా 7 గురుకుల పాఠశాలలతో పాటు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

'ఒక సామాన్యుడైన నన్ను ఎమ్మెల్యే చేసిన ఘనత కేసీఆర్ దే. నాకు అవకాశం కల్పించి కార్పొరేటర్, మేయర్,ఎమ్మెల్యే గా చేశారు. అందుకు ప్రజల కోసమే పని చేస్తున్నా.అక్రమంగా ఒక గజం జాగా కూడా ముట్టుకోలేదు. ఏ ఒక్కరినీ ఒక్క రూపాయి అడగలేదు. నిఖార్సుగా ప్రజలకోసం మాత్రమే పాటుపడుతున్నా..ఒక పేదింటి బిడ్డ ఎమ్మెల్యే అయితే నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా మీ కళ్ళముందు కనిపిస్తుంది. బోడకుంట్ల వెంకటేశ్వర్లు గతంలో సైతం నాకు అన్ని విధాలా అండగా ఉన్నారు. బిఆర్ఎస్ పార్టీ రెండు సార్లు నగర అధ్యక్షునిగా,మేయర్, ఎమ్మెల్యే పని చేసే అవకాశం నాకు కల్పించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలు కాన్పు నుండి కాటి వరకు అన్ని రకాలుగా అందిస్తున్నారు.జూన్ 2 నుండి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాల ప్రణాళిక సిద్ధమైంది' అని అన్నారు

ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ.. 'నరేందర్ ఒక నిరుపేద కుటుంభం నుండి ఎదిగారు. నిరంతరం ప్రజల్లో ఉంటున్న నాయకుడు నన్నపునేని నరేందర్. కేసీఆర్ ఆశీర్వాదంతో నరేందర్ నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నారు. కేసీఆర్,నరేందర్ ని కాపాడుకోవాలి. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ రాకముందు కరెంట్ కష్టాలు,నల్లాల దగ్గర బిందెలతో పంచాయతీ ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తరువాత అవేవి లేవుజ అభివృద్ధిలో నంబర్ వన్ గా నిలిచాం. అభివృద్ధి, సంక్షేమంతో అన్ని రకాలగా ముందున్నాం. పనిచేసే ముఖ్యమంత్రిని కాపాడుకోవాలి' అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed