- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నై తెలంగాణ అన్నోళ్లతోనే జై తెలంగాణ అనిపించాం: బీజేపీకి ఎమ్మెల్యే దాస్యం వార్నింగ్
దిశ, హనుమకొండ టౌన్: పార్లమెంట్ సాక్షిగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేమని కేంద్రం ప్రకటించడానికి నిరసనగా కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల నుండి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటి బీజేపీ ప్రభుత్వం కాజీపేట ప్రజల కలను కలగానే మిగిల్చిందని మండిపడ్డారు. 1980 అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు కాజీపేటకు మంజూరు చేసిన రైల్వే ఫ్యాక్టరీని.. పంజాబ్‌లో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అప్పటి నుండి కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ కోసం ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. కానీ ఇప్పటివరకు కోచ్ ఫ్యాక్టరీ రాలేదన్నారు. కోచ్ ఫ్యాక్టరీని మరిపించడానికి పీఓహెచ్ వేగన్ పరిశ్రమ పేర్లతో చిన్న చిన్న పరిశ్రమలు మంజూరు చేశారన్నారు.
అది కూడా రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తేనే షెడ్లను ఏర్పాటు చేస్తామని నిబంధన పెట్టారని ఫైరయ్యారు. 160 ఎకరాల భూమి స్థలం సేకరించి ఇచ్చినా కూడా.. రైల్వే శాఖ సాకులు చెబుతూ వాయిదా వేస్తూ వస్తుందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణకు ప్రయోజనం చేకూర్చే ఒక్కటంటే ఒక్క విభజన హామీని బీజేపీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోగా.. రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో అవగాహన రహిత్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయడం వారి దిగజారుడు తనానికి అద్దం పడుతోందని అన్నారు. ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు పరిశ్రమలను, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదో రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజ్యసభలో కేంద్ర మంత్రి తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని లిఖిత పూర్వక సమాధానం ఇస్తే.. స్థానిక బీజేపీ నాయకులేమో రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడం లేదని ప్రచారం చేయడం బీజేపీ ద్వంద దొంగ వైఖరిని బహిర్గతం చేస్తుందన్నారు. నై తెలంగాణ, నో తెలంగాణ అన్నోళ్లతోనే జై తెలంగాణ అనిపించిన తెలంగాణ ప్రజలు.. విభజన హక్కులను పొందేందుకు అలాగే మా ప్రాంతానికి లబ్ధిని చేకూర్చే కోచ్ పరిశ్రమ విషయంలో కేంద్రంపై దశల వారిగా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలువురు యువకులు భారత రాష్ట్ర సమితిలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నార్లగిరి రమేష్, కాజీపేట రైల్వే కోచ్ సాధన సమితి నుండి పలువురు సభ్యులు, పలువురు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.