ముత్తిరెడ్డే మా నాయకుడు.. ఆయనకు టికెట్ ఇస్తేనే అభివృద్ధి: బాల్దే సిద్ధి లింగం

by Mahesh |   ( Updated:2023-08-17 07:42:37.0  )
ముత్తిరెడ్డే మా నాయకుడు.. ఆయనకు టికెట్ ఇస్తేనే అభివృద్ధి: బాల్దే సిద్ధి లింగం
X

దిశ, జనగామ: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డే మా నాయకుడు, ఆయనకే టికెట్ ఇవ్వాలని, ఆయనకు టికెట్ ఇస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధిస్తుందని జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బాల్దే సిద్ధి లింగం అన్నారు. గురువారం జనగామ పట్టణంలోని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి క్యాంపు కార్యాలయంలో జనగామ మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్ సహా పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు ముత్తిరెడ్డికి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధి లింగం మాట్లాడుతూ.. జనగామ అడ్డ ముత్తిరెడ్డిది, 2009లో కెసిఆర్ ఆదేశాల మేరకు జనగామకు వచ్చాడని ఆయన అన్నారు. కాంగ్రెస్ కంచు కోట లాగా వుండే,పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గార్లను ఢీ కొట్టి ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. ఈ క్రమంలో 2009 నుండి 2014 వరకు కష్టనష్టాలను తట్టుకొని పని చేసి జనగామ నియోజకవర్గం అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.

అంతేకాకుండా అలాంటి జనగామ నియోజకవర్గంలో కార్యకర్తలకు,నాయకులకు సామాజిక న్యాయం చేసి ఎంతోమందికి పదవులు ఇచ్చారని కూడా అన్నారు. పార్టీలో గుర్తింపు లేని వాళ్ళు కొందరు ముత్తిరెడ్డిని వ్యతిరేకిస్తున్నారని, ఇది సరైనది కాదని, మేము ముఖ్యమంత్రి ఒకటే కోరుతున్నాం ముత్తిరెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వాలనేదే మా ప్రధాన డిమాండ్ అని సిద్ధి లింగం తో పాటు పలువురు ఈ సందర్భంగా అన్నారు. మేము ముత్తిరెడ్డి మద్దతు ఇవ్వడం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒక సామాజిక వర్గం కోసం పని చేయడం సరైంది కాదని, పరోక్షంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి కోసం పాగాలా సంపత్ రెడ్డి పనిచేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముత్తిరెడ్డి టికెట్ కచ్చితంగా వస్తుందని మేము నమ్ముతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావులు తప్పకుండా ముత్తిరెడ్డికి టికెట్ ఇచ్చేలా కృషి చేస్తారని కూడా వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ అనిత, సీనియర్ నాయకులు ఏబేలు సహా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

నేడు ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం

ఇదిలా ఉంటే సమావేశం అనంతరం వీరిలో ముఖ్య నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ముత్తిరెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరేందుకు జనగామ నుంచి హైదరాబాదుకు తరలి వెళ్ళినట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story