- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఏసీబీ వలలో చిక్కిన జనగామ మున్సిపల్ కమిషనర్
దిశ,జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ ఏసీబీ దాడిలో మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత తో పాటు ఆమె డ్రైవర్ నవీన్ కూడా అధికారులు పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. లింగాల గణపురం మండలం బండ్లగూడకు చెందిన చిట్టిపల్లి రాజు కు జనగామ జిల్లా కేంద్రం సూర్యాపేట రోడ్డు లో జి ప్లస్ త్రీ భవనం ఉంది.ఈ ఇల్లు కు సంబంధించి మున్సిపల్ పేరిట మార్టిగేజ్ చేసిన 10 శాతం భూమి రిలీజ్ కోసం కమిషనర్ కు రాజు దరఖాస్తు చేసుకున్నాడు.
అయితే కమిషనర్ రూ.60 వేలు డిమాండ్ చేయగా రాజు రూ.40 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. అనంతరం వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్యను ఆశ్రయించాడు. పథకం ప్రకారం రాజు ఒప్పుకున్న సొమ్మును కమిషనర్ కు ఇచ్చేందుకు సిద్ధం కాగా ఆమె తన కారు డ్రైవర్ నవీన్ కు ఆ డబ్బులను ఇవ్వాల్సిందిగా సూచిస్తుంది. దీంతో రూ.40 వేలను రాజు నవీన్ కు ఇవ్వగా వెంటనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకే డబ్బులు తీసుకున్నట్లు డ్రైవర్ ఏసీబీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరిని రేపు హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ కోర్టులో రిమాండ్ చేస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సిబ్బంది రవి, శ్యామ్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.