- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జిల్లాలో ప్రశాంతంగా మొదటి రోజు ఇంటర్ పరీక్షలు..
దిశ, ములుగు ప్రతినిధి: జిల్లాలో బుధవారం మొదటి రోజున ఇంటర్ మొదటి సంవత్సరం రెండవ భాష పేపర్ -1 పరీక్ష జరగగా (1938)మంది పరీక్షకు హాజరు కాగా,(195) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి పి. వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలో (10) ఇంటర్ పరీక్షా కేంద్రాలలో జనరల్, వొకేషనల్ కలిపి (2133) మంది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాయాల్సి ఉండగా, (1938) మంది విద్యార్థులు హాజరయ్యారని, జిల్లాలో మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, ప్రశాంతంగా పరీక్ష జరిగిందని, (195) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. జనరల్ అభ్యర్థులు (2133) మందికి గాను (1995) మంది హాజరు కాగా, (138) మంది గైర్హాజరు అయ్యారని, అలాగే వొకేషనల్ (1938) మందికి గాను (1816) మంది హాజరు కాగా (122) మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. మొత్తంగా ఈ రోజు (93.53) శాతం హాజరయ్యారని తెలిపారు.
ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ
బుధవారం జిల్లా కలెక్టర్ జాకారంలోని టిఎస్‌డబ్లుఆర్ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షను పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. పిల్లల హాల్ టికెట్ నంబర్లు కనపడే విధంగ ప్రదర్శించాలని తెలిపారు. పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను, మౌలిక సౌకర్యాలను పరిశీలించారు. పరీక్షా తీరును, హాజరైన విద్యార్ధుల వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరిని అడిగి తెలుసుకున్నారు.
ములుగు జిల్లా ఎస్పీ గాష్ ఆలం ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎగ్జామ్స్ జరుగుతున్న విధానం,భద్రత ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ములుగు డివిజన్‌లో 06 పరీక్ష కేంద్రాలు, ఏటూరునాగారం డివిజన్‌లో 04 పరీక్ష కేంద్రాలు మొత్తంగా 10 పరీక్ష కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు చేయడమైనదని. పరీక్ష కేంద్రం ప్రాంగణం చుట్టుపక్కల ప్రాంతాలలోని అన్ని జిరాక్స్ షాప్స్ ముసివేశామని.. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. పరీక్ష ప్రశ్నా పత్రము, జవాబు పత్రాలు భద్రపరచు స్ట్రాంగ్ రూమ్ వద్ద ఆర్మ్డ్ ఫోర్స్ తో భద్రత కల్పించామని, ఎస్సైలు/ఏ. ఎస్. ఐ ల ద్వారా ఫ్లయింగ్ స్క్వాడ్స్ నియమించి పరీక్షలు పారదర్శకంగా జరిగేలా చూస్తున్నామని ఎస్పీ తెలిపారు.