మండలంలో అక్రమ బెల్లం లారీ కలకలం..!

by Mahesh |
మండలంలో అక్రమ బెల్లం లారీ కలకలం..!
X

దిశ: బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో గత కొద్ది రోజుల క్రితం బెల్లం లారి అక్రమ రవాణా అవుతున్న విషయం తెలుసుకున్న కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బెల్లం లారీని వెంబడించారు. వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఇల్లందు నియోజకవర్గంలో ఈ టాపిక్ హాట్ టాపిక్ మారింది. గుట్టు చప్పుడు కాకుండా నల్ల బెల్లం రవాణా చేసే స్మగ్లర్ల లారిని వెంబడించి విలేఖరులమని వారిని బెదిరించి యాబై నుంచి 60 వేల రూపాయలు అక్రమంగా వసూళ్లకు పాల్పడినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. పోలీసులకు తెలియకుండా ఎవరు ఇలా డబ్బులు వసూలు చేశారనేది తెలియాల్సి ఉంది.

బెల్లం రవాణా పై జర్నలిస్టులకు ముందస్తు సమాచారం ఉంటే సంబంధిత శాఖ వారికి లేక ఆబ్కారీ శాఖ తెలియ చేసే వారు. కానీ అలా ఇక్కడ జరగక పోవడంతో ఎవరి నోట విన్నా గుడుంబా బెల్లం లారీ పట్టుకున్నారంటా.. డబ్బులు తీసుకుని వదిలేశారట అనే ముచ్చట్లు వినబడుతున్నాయి. ఈ విషయం స్థానిక ఎస్సై రమాదేవిని వివరణ కోరగా మండలంలో గుడుంబా రవాణా చేస్తున్న లారిని కొంత మంది పట్టుకున్న విషయం చర్చ జరుగుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. పూర్తి వివరాలు రాబట్టేందుకు దీనిపై సిబ్బంది రాత్రి వేళలో గస్తీ ముమ్మరం చేశామని వాస్తవ అవాస్తవాలను రాబట్టి దోషుల పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Advertisement

Next Story