నిరంతరం విద్యుత్ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గండ్ర

by Kalyani |
నిరంతరం విద్యుత్ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గండ్ర
X

దిశ, చిట్యాల : నిరంతరం విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండలంలోని నైన్ పాక గ్రామంలో సుమారు రూ.110 లక్షలతో నూతనంగా నిర్మించిన 33/11 కె.వి విద్యుత్ ఉపకేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అంతకుముందు ఒడితల గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 33/11కె.వి విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాణ్యమైన, కోతలు లేని విద్యుత్ ను అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతులకు, నిరుపేదలకు లాభసాటిగా ఉండే పథకాలను కొనసాగిస్తూనే, విద్యుత్ రంగాన్ని పునరుద్ధరించే ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలిపారు.

ఆరు గ్యారంటీలలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం గృహ జ్యోతి పథకాన్ని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. 200 యూనిట్లు లోపు, విద్యుత్ వాడే వినియోగదారులకు విద్యుత్ ను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు గూట్ల తిరుపతి, గడ్డం కొమురయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీకృష్ణ, మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి సత్యం ,సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు కామెడీ రత్నాకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డు కిష్టయ్య, విద్యుత్ ఎస్సి మల్సూర్ నాయక్, ఈ ఈ వెంకట్రావు, డి ఈ ,పాపిరెడ్డి సదానందం ఏ డి ఈ ,సందీప్ ఏ ఈ చంద్రశేఖర్, మల్లేష్, కుమార్, లక్ష్మణ్ గౌడ్, ఉయ్యాల రమేష్ . విద్యుత్ సిబ్బంది, కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Next Story