- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటికీ వివరించాలి: ఎమ్మెల్యే ఆరూరి
దిశ, హనుమకొండ టౌన్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో 9 ఏండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హన్మకొండ వడ్డేపల్లి లోని శ్యామల గార్డెన్స్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకొని మూడోసారి సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి రావటాన్ని ఏ శక్తి ఆపలేదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అలాగే సీబీఐ, ఈడీ, ఐటీలను కేంద్రం తన స్వార్థ రాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నదో ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలే కీలకం అని, పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిరంగి సునీల్, డివిజన్ ప్రెసిడెంట్ రుద్రోజు మణింద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.