- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
'అటవీ శాఖ అధికారులకు రక్షణ కల్పించాలి'

దిశ, ములుగు ప్రతినిధి: రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ అధికారుల పై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో గురువారం ఫారెస్ట్ అధికారులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శంకర్ మాట్లాడుతూ.. ఫారెస్ట్ అధికారుల పై జరుగుతున్నా దాడులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం జరిగే విధంగా చొరవ చూపాలని, ఫారెస్ట్ అధికారులకు భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అటవీ శాఖ అధికారులకు రక్షణ కల్పించే విధివిధానాలు రూపొందించాలని, ప్రతి రేంజ్ పరిధిలో ఒక ఫారెస్ట్ స్టేషన్ ఏర్పాటు చేసి, ఆయుధాలు సమకూర్చేలా, ఉద్యోగ భద్రతకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి అడవులను ధ్వంసం చేస్తున్న గొత్తికోయల స్థానికతను రద్దు చేసి, తక్షణమే అడవుల నుంచి బయటికి పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి :