కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి : ప్రభుత్వ విప్

by Kalyani |
కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి :  ప్రభుత్వ విప్
X

దిశ, మరిపెడ : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ & డోర్నకల్ శాసనసభ్యుడు డాక్టర్ రామచంద్రనాయక్ కోరాడు. కురవి, సీరోల్,మరిపెడ,చిన్న గూడూరు మండలాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించిన అనంతరం విప్ మాట్లాడుతూ… ఆరుగాలం రైతులు కష్టించి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుక వచ్చి మద్దత్తు ధర పొందాలని అన్నారు. రైతులు వరి ధాన్యాన్ని 17 శాతం తేమ తో కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని, దళారీలకు విక్రయించి మోసాలకు గురికావద్దని ఆయన సూచించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు కలవనీయకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రైతులకు గన్ని సంచుల కొరత, ఇతరత్రా సమస్యలు లేకుండా అధికారులు చూడాలి అన్నారు.కొనుగోలు కేంద్రాలను రైతుల ప్రయోజనం కోసం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. క్వింటాకు 500 రూపాయల బోనస్ రావడం పట్ల రైతులంతా హార్షం వ్యక్తం చేస్తున్నరాని పునరుద్ఘాటించారు.

Advertisement

Next Story