- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శివాలయంలో గుప్తనిధుల తవ్వకాలు..
దిశ, తొర్రూరు:- మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలంలోని మాటేడు గ్రామ శివాలయంలో శుక్రవారం రాత్రి దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలయంలోని నంది విగ్రహం వద్ద చోటుచేసుకుంది.శనివారం ఉదయం ఆలయానికి వెళ్లిన గ్రామస్థులు నంది విగ్రహం వెనుక సొరంగం తవ్వకాలు జరిగిన విషయాన్ని గమనించి స్థానిక అధికారులకు సమాచారం అందించారు. అనుమానితులు గుప్తనిధుల ఆశ వల్ల శివాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నారని భావిస్తున్నారు. ఈ సంఘటన పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ ఆలయంపై దాడి చేయడం సంప్రదాయాలు, విశ్వాసాలను దెబ్బతీసే చర్య అని పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఉపేందర్ తెలిపారు. గతంలో ఇలాంటి ఘటనలు పలుచోట్ల వెలుగు చూడటం, గుప్తనిధుల గురించి వ్యాపించే అపోహలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇలాంటి చర్యలను అడ్డుకోవడానికి పోలీసు దర్యాప్తు తో పాటు ప్రజల్లో అవగాహన పెంచడం కూడా కీలకమని అధికారులు తెలిపారు.