చచ్చినా పైసా రాదు.. TSGLI వినియోగదారుల పరిస్థితి దారుణం..

by Kalyani |   ( Updated:2023-04-12 11:58:31.0  )
చచ్చినా పైసా రాదు.. TSGLI వినియోగదారుల పరిస్థితి దారుణం..
X

దిశ, హన్మకొండ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా సౌకర్యం కల్పించి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా జీవిత బీమా పొందాలని సూచించారు. ఇందులో మార్గదర్శక సూత్రాలను పేర్కొన్నారు. ఇతర జీవిత బీమా సౌకర్యాలకు అనుగుణంగా రూపొందించిన అవి ఎక్కడా అమలు కావడం లేదని ప్రభుత్వ ఉద్యోగుల వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగుల నెలవారీ జీతం నుంచి రూ. 50 నుంచి రూ. 2 వేల వరకు జీవిత బీమా కోసం నేరుగా ప్రభుత్వ ట్రెజరీకి చేరగా అక్కడి నుంచి ఏపీజీఎల్ఐ ఖాతాలకు చేరేవి. ప్రభుత్వ ఉద్యోగి మరణించిన, ఉద్యోగ విరమణ చేసిన సమయానికి అందేవిధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకునే వారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమాగా కార్యాలయం బోర్డు మారినా, వినియోగదారుల్లో నిరాశే కనిపిస్తోంది.

ప్రతి సంవత్సరం వందల సంఖ్యల్లో ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ పొందినవారు, వివిధ కారణాలతో మృతి చెందిన వారు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో దరఖాస్తూ చేసుకున్న వారి ఫైళ్లు ఆయా కార్యాలయాల్లో కుప్పలుగా పోశారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే తప్ప వచ్చే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైడ్ మెంట్ వయసును పెంచడంతో అప్పటికే రిటైడ్ అయిన ఉద్యోగులు దరఖాస్తూ చేసుకొని రెండు సంవత్సరాలు దాటినా నేటికి కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగే దాకా తిరిగినా ఎప్పుడు వస్తాయో తెలియదంటూ అధికారులు చెబుతున్నారని, ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి నిధులు మళ్లించారని చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దరఖాస్తూ చేసుకున్న టీఎస్ జీఎల్ఐ వియోగదారులకు త్వరితగతిన డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story