- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజీవ్ హయాంలో బడుగు,బలహీన వర్గాలు అభివృద్ధి
దిశ, వరంగల్ టౌన్ : రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో బడుగు, బలహీన వర్గాల ప్రజాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వరంగల్ పట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి మంత్రి జూపల్లి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ప్రస్తుతం దేశ ప్రజలు అనుభవిస్తున్న సాంకేతికకు రాజీవ్ గాంధీ ఆధ్యుడని తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, వరంగల్ (వెస్ట్) ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.