ఆపరేషన్ స్మైల్ ద్వారా ఎంత మందికి విముక్తి కల్పించారో తెలుసా

by Sridhar Babu |
ఆపరేషన్ స్మైల్ ద్వారా ఎంత మందికి  విముక్తి కల్పించారో తెలుసా
X

దిశ, హనుమకొండ : ఆపరేషన్ స్మైల్ ద్వారా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న 161 మంది చిన్నరులకు విముక్తి కలిగించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. గత నెల జనవరి మొదటి తేదీ నుండి నెలాఖరు వరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు బాలల సంరక్షణ విభాగం, చైల్డ్ లైన్, కార్మిక శాఖతో కలిసి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో బాల కార్మికులు, బడి మానేసిన 161 మంది బాలబాలికలను గుర్తించి వారిని బాలల సంరక్షణ గృహానికి తరలించారు.

ఇందులో 137 మంది బాలలు, 24 మంది బాలికలు ఉన్నారు. బాలల సంరక్షణ గృహానికి తరలించిన వారిలో తెలంగాణకు చెందిన 92, ఇతర రాష్ట్రాలకు చెందిన 69 మంది చిన్నారులు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ తనిఖీల్లో చిన్నారులచే పనులు చేయించుకుంటున్నా ఏడుగురు షాపు యజమానులపై కేసులు నమోదు చేశారు. అలాగే ఈ తనిఖీల్లో ఉత్తరప్రదేశ్ కు చెందిన బాలికను దర్పణ్ యాప్ ద్వారా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించినట్టు తెలిపారు. చిన్నారులతో వెట్టి చాకిరీ చేయించుకునే యాజమానుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పనిలో పెట్టుకున్న యాజమాన్యంకు రెండు సంవత్సరాల జైలు శిక్ష, 50 వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.


Next Story

Most Viewed