దిశ ఎఫెక్ట్​...ధాన్యం కొనుగోలులో అవకతవకలపై అధికారులు నజర్​

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్​...ధాన్యం కొనుగోలులో అవకతవకలపై అధికారులు నజర్​
X

దిశ, మల్హర్ : మల్హర్ మండలం ఎడ్లపల్లి పరిధిలోని జంగిడిపల్లిలో కేడీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలులో అవకతవకలపై ప్రచురించిన దిశ కథనంపై గురువారం అధికారులు మేల్కొన్నారు. విచారణకు సై అంటున్నారు. దిశ పత్రికలో ధాన్యం దోపిడీ అని వచ్చిన కథనంపై గ్రామంలో క్షుణంగా పరిశీలించి విచారణ చేస్తామని, అక్రమాలకు పాల్పడ్డ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రిపోర్టులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పొలం దున్న కుండ.. పంట పండీయకుండా ధాన్యం ఎలా విక్రయిస్తారని, విక్రయించిన ఆ ధాన్యం సొమ్ము అక్రమార్కుని వ్యక్తిగత ఖాతాలోకి ఎలా మళ్లీస్తారని పూర్తిస్థాయి విచారణకు జిల్లా డీఎం ఆఫీస్ నుంచి రిపోర్ట్ సేకరించినట్లు తెలిసింది. బాధ్యులు ఎవరైనా సరే చర్యలు తీసుకుంటామంటూ హుకుం

జారీ చేయడంతో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ నిర్వాహకుల గుండెల్లో గుబులు మొదలైంది. 324.80 క్వింటాళ్ల ధాన్యం అక్రమంగా సెంటర్ నిర్వాహకుడి కుమారుడి పేరుతో ట్రక్ సీట్ ద్వారా రైస్ మిల్లులకు తరలించి రూ.7 లక్షల పైచిలుకు కొయ్యూరు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వ్యక్తిగత ఖాతాకు మళ్లించి అక్రమాలకు పాల్పడ్డ అక్రమార్కుడి నుండి రూ.7 లక్షల రికవరీ చేసి బాధిత రైతులకు పంపిణీ చేయాలని చూస్తున్నట్టు తెలిసింది. నిర్వాహకుడి కుమారుడు పై చర్యలు తీసుకుంటామంటున్నారు. ధాన్యం కొనుగోలులో నిర్వాహకులే దళారి వ్యవస్థ నిర్వహిస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారని, రైతులను మోసం చేసిన అక్రమార్కుడు బొమ్మ శ్రావణ్, సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు. ధాన్యం కొనుగోలులో నిర్వాహకుల అక్రమ దందాపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్లు తెలిసింది. ఇక దోషులు ఎవరనేది తేలనుంది.

Advertisement

Next Story

Most Viewed