- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యేగా వినయ్ భాస్కర్ ఫెయిల్ (వీడియో)
దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ఫెయిలయ్యారని హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాకపోవడం, పీవోహెచ్ తరలింపు వ్యవహారం వినయ్ భాస్కర్ అసమర్థత కాదా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ పట్టింపులేనితననానికి, పోరాటలేమికి నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి, తొమ్మిదేళ్లుగా బీజేపీతో కాపురం చేయడానికి సరిపోతోందని అన్నారు. స్మార్ట్ సిటీ నియోజకవర్గంలో గుంతల రోడ్లు, రోడ్డున పారుతున్న మురుగునీరు దర్శనమిస్తోందని అన్నారు. కాజీపేట జంక్షన్ సమస్యలపై, కాజీపేట పట్టణ అభివృద్ధిని నిర్వీర్యం చేసి మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. త్రినగరిలో భాగమైన కాజీపేటలో గడిచిన ఎనిమిదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. చివరికి కాంగ్రెస్ హయాంలో మంజూరైన కోచ్ ఫ్యాక్టరీని సైతం దక్కించుకునేందుకు చేయాల్సినంత ప్రయత్నం జరగలేదని అన్నారు. అవసరమైనప్పుడల్లా కాజీపేట జంక్షన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ భవన్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే ఆయన వెనుక తిరిగే కొంతమంది తాగుబోతోళ్లు, చిల్లర నాయకులతో వ్యక్తిగత విమర్శలు చేయిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో తాను చేసిన ఆరోపణలపై, ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి.. తన స్థాయి కాదని వ్యాఖ్యనించడం తప్పించుకోవడమే అవుతుందని అన్నారు.
ఎమ్మెల్యేవీ భూ కబ్జాలు, సెటిల్‌మెంట్‌లు
వందలాది భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు, ప్రశ్నించిన వాళ్లపై వందలాది కేసులు పెట్టేటువంటి స్థాయి తనది కాదని, ఈ విషయంలో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌కే ఆ ఘనత దక్కిందని అన్నారు. ఎమ్మెల్యే అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఖచ్చితంగా వరంగల్ పశ్చిమ ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తన వ్యక్తిగత చరిష్మాను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. తనపై పదేపదే కేయూ భూములను కబ్జా చేసినట్లుగా ఎమ్మెల్యే ఆరోపణలు చేయిస్తున్నాడని, దమ్ముంటే డేట్ ఫిక్స్ చేయాలని, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని, కేయూ భూములు ఆక్రమించుకున్నట్లుగాని, తనపై గాని, తన బినామీల పేరుమీదుగా గాని రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. గతంలో ఎస్సీలకు, పేదలకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను సైతం తిరిగి రికవరీకి ఆదేశాలు చేస్తున్న ఘనత ఎమ్మెల్యేకే చెందుతుందని అన్నారు. పార్టీలో చేరకుంటే స్థలాలను వివాదాల్లో కొనసాగిస్తున్నారంటూ ఆరోపించారు.
డబుల్ బెడ్‌రూంలెందుకు పంపిణీ చేయడం లేదు?
వరంగల్ పశ్చిమలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఎందుకు మంజూరు చేయడం లేదని ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ను నాయిని సూటిగా ప్రశ్నించారు. నిర్మాణం పూర్తయి ఐదేళ్లు గడుస్తూ శిథిలావస్థకు చేరుకుంటున్నా ఏవో అర్థంలేని సాకులు చెబుతూ, ఏళ్లుగా పేదలు కళ్లు కాయలే కాసేలా ఎదురు చూస్తున్నారని అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు ఎమ్మెల్యే పనితీరును చూస్తున్నారని, ఖచ్చితంగా బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇకపై రాజకీయ నాటకాలు సాగవని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఓబీసీ విభాగం చైర్మన్ బొమ్మతి విక్రం, గ్రేటర్ మైనారిటీ కాంగ్రెస్ చైర్మన్ మీర్జా అజీజుల్లా బేగ్, జిల్లా ఐటీ వింగ్ చైర్మన్ వింజమూరి లక్ష్మీ ప్రసాద్, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అలువాల కార్తీక్, జిల్లా ఎన్ ఎస్ యూఐ అధ్యక్షుడు పల్లకొండ సతీష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అంకుష్, మేకల ఉపేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్, టీపీసీసీ సోషల్ మీడియా కార్యదర్శి మహమ్మద్ ముస్తాక్ నేహాల్, టీపీసీసీ ఓబీసీ డిపార్టుమెంటు కార్యదర్శి ఇప్పా శ్రీకాంత్, గ్రేటర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుంటి స్వప్న, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ చైర్మన్ నల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.