భూపాలపల్లిలో కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష..

by Kalyani |
భూపాలపల్లిలో కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష..
X

దిశ, కాటారం, (భూపాలపల్లి): కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసినందుకు నిరసనగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు. ఉదయం ప్రారంభమైన ఈ దీక్ష సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. ఈ దీక్షలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు.

పార్లమెంటులో రాహుల్ గాంధీని ఎదుర్కొనలేకనే అతనిపై పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు వేటు వేశారని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఈ దీక్షలో డీసీసీ ప్రెసిడెంట్ అయిత ప్రకాష్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి దొమ్మాటి సాంబయ్య, కాంగ్రెస్ కౌన్సిలర్ గాట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story