మానవాళి మనుగడ కోల్పోయే ప్రమాదం: తిరుమల్ రెడ్డి

by Disha News Web Desk |
మానవాళి మనుగడ కోల్పోయే ప్రమాదం: తిరుమల్ రెడ్డి
X

దిశ, భూపాలపల్లి: ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఆహార భద్రత కమిటీ చైర్మన్ తిరుమల్ రెడ్డి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని ఇల్లందు గెస్ట్ హౌస్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో ఆహార భద్రత అమలు తీరును పరిశీలించినట్లు తెలిపారు. పౌష్టిక ఆహారలోపంతో పిల్లల యొక్క ఎదుగుదల పరిపుష్టి కరంగా లేనందువల్ల మానవాళి మనుగడ కోల్పోయే పరిస్థితుల్లో మానవ సంపదను కాపాడుకునేందుకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో చౌక దుకాణాల నిర్వహణ, అంగన్ వాడీ సెంటర్ల ద్వారా జరుగుతున్న పౌష్టికాహార పంపిణీ, పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, ప్రభుత్వ ఆస్పత్రల్లో జరుగుతున్న ప్రసవాలు, గర్భిణులకు అందజేస్తున్న కేసీఆర్ కిట్లు తదితర వాటి గురించి శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు.

నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో త్వరలో చౌక దుకాణాలను ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ.. ఆహార భద్రత చట్టం అమలుపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు సమావేశంలో తెలియజేసిన సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. అనంతరం కమిటీ చైర్మన్‌ను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, డీఆర్డీఏ పురుషోత్తం, డీఎస్ వో గౌరీశంకర్, జడ్పీ సీఈవో శోభారాణి, డీపీవో ఆశాలత, జిల్లా సంక్షేమ అధికారి శామ్యూల్, ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీడీవోలు సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story