- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూప్ 2 పరీక్షకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు
దిశ, ములుగు ప్రతినిధి: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం అవ్వగా ములుగు జిల్లాలో నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షకు ఏడుగురు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. గ్రూప్ 2 పరీక్ష రాసే అభ్యర్థులు 9:30 గంటల లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సిందిగా అధికారులు తెలుపగా ములుగు జిల్లా కేంద్రంలోని సాధన స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం వద్ద గేట్లు మూసిన ఐదు నిమిషాల తర్వాత ఆలస్యంగా ఇద్దరు అభ్యర్థులు రాగా అధికారులు వారిని అనుమతించలేదు. ములుగు జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్ వద్ద ముగ్గురు అభ్యర్థులు, జాకారం గురుకులం వద్ద ఒకరు, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల వద్ద ఒక అభ్యర్థి ఆలస్యం వచ్చారు. దీంతో అభ్యర్థులు అధికారులను ఎంత బతిమిలాడినా వారిని పరీక్షా కేంద్రానికి అనుమతించకపోవడంతో చేసేదేమి లేక కన్నీరు పెడుతూ పరీక్ష కేంద్రం నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు.