బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని.. జల దీక్ష

by Vinod kumar |
బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని.. జల దీక్ష
X

దిశ, గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల-రాంపురం పాకాల వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బ్రిడ్జి సాధన కమిటీ జల దీక్ష ఆదివారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జి ప్రతాప్ మాట్లాడుతూ.. ఈ బ్రిడ్జిని నిర్మాణం వెంటనే చేపడతామని చెప్పిన గత ప్రజా ప్రతినిధులు దశాబ్ది కాలం అయినా కూడా నిర్మాణం మొదలు పెట్టకపోవడం చాలా బాధాకరమన్నారు. వర్షాకాలంలో ఈ బ్రిడ్జి పై నుండి 10 పైన గిరిజన తండాలు వారి నిత్యావసరాలు కొరకు ప్రయాణిస్తూ ఉంటారు. ఈ గిరిజన తండాలు కూతవేటు దూరంలో ఉన్నగార్లకి రావడానికి 24 కిలోమీటర్లు చుట్టూత తిరిగి రావాల్సి వస్తుంది.

వర్షాకాలంలో ముఖ్యంగా విద్యార్థులు, రైతులు, గర్భిణీ స్త్రీలు, ప్రజలు వారి నిత్యావసరాల కొరకు బ్రిడ్జి పై నుండి రాలేక చాలా ప్రమాదాలకు గురవుతున్నారు. విద్యార్థులు స్కూల్ కి దూరమై చదువుకు దూరం అవుతున్నారు. ఇకనైనా పాలకులు, రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి దశాబ్ది ఉత్సవ వేడుకలకు పెట్టే వృధా ఖర్చులకు బదులు ఇలాంటి గ్రామ బ్రిడ్జి నిర్మాణాలకి కేటాయించగలిగితే చాలా బాగుంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఎస్పీ అధికారంలో వచ్చిన వెంటనే బ్రిడ్జి నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేసి రాంపురం ప్రజల అభివృద్ధికి తోడ్పడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గార్ల మండల అధ్యక్షులు అజ్మీర వెంకన్న, బీఎస్పీ మండల నాయకులు వాగ్య, రాం కుమార్, నవీన్, సంపత్, బ్రిడ్జి సాధన కమిటీ నాయకులు కొమరాజు జగదీష్, రామగిరి శ్రీను, ఆడెపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed