- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిమ్మాపురం పంట పొలాల్లో ‘బెంగాల్ టైగర్’ జాడ..
దిశ, మంగపేట : మండలంలో ప్రవేశించిన బెంగాల్ టైగర్ బుధవారం మండలంలోని నిమ్మ గూడెం పంచాయతీ తిమ్మాపురంకు చెందిన కొమురం బాబు రైతు పంట పొలం చౌడువొర్రె సమీపంలో సంచరించిన అడుగుజాడలను గుర్తించి మండల ఫారెస్టు, పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. మంగళవారం భోదాపురం నుండి గోదావరి మార్గంలో వెంకటాపురం (నూగూరు) నుండి మండలంలోని చుంచుపల్లి రేవు దాటిన పులి మల్లూరుగుట్ట అటవీ ప్రాంతంలో చొరబడినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించి మండల ప్రజలను అప్రమత్తం చేశారు. బుధవారం తిమ్మాపురం చేరుకున్న మండల పారెస్టు అధికారులు తిమ్మాపురం చౌడువొర్రె, కొప్పుగుట్ట, ముపసలమ్మగుట్ట అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు భావిస్తుండడంతో ఫారెస్టు అధికారులు సమీప గ్రామాలైన కరకగూడెం, రంగాపురం, బీరెల్లి, చొప్పాల, భగవంతాపురం, చిర్రమల్ల, రఘునాధపాలెం, గొల్లగూడెం, చొప్పాల గ్రామాలకు చెందిన ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.