- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏసీబీ దాడుల కలకలం (వీడియో)
దిశ, ఏటూరు నాగారం: ములుగు జిల్లా ఏటూర్ నాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు కలకలం రేపాయి. ఏటూరునాగారం మండల కేంద్రంలోని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఇంజనీరింగ్ విభాగం కార్యాలయంలో ఇద్దరు ఇంజనీర్లు ఏసీబీ వలకు చిక్కారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 50 వేల లంచం తీసుకుంటుండగా ఇద్దరు ఇంజనీర్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... సమ్మక్క సారలమ్మ జాతర జరిగే తాడ్వాయి మండలం మేడారంలో ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులు చేస్తుంది. ఈ క్రమంలో 2022 జాతర జరిగిన సమయంలో మేడారంలోని అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో ములుగు జిల్లా కేంద్రానికి చెందిన కాంట్రాక్టర్ సంజీవ మరికొందరితో కలిసి పెయింటింగ్ పనులు చేశాడు. ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు జరిగాయి. పనులు చేసిన కాంట్రాక్టర్ సంజీవ బృందానికి రూ. 16 లక్షలు బిల్లు చెల్లింపులు జరపాల్సి ఉంది.గత డిసెంబర్ లో ఎంబీ రికార్డు చేశారు. రూ. 16 లక్షల చెక్కును ఇవ్వడానికి ఏటూరునాగారంలోని ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఉపకార్య నిర్వహక ఇంజనీర్(డీఈఈ) నవీన్ కుమార్, అసిస్టెంట్ కార్యనిర్వహక ఇంజనీరు(ఏఈఈ) మహ్మద్ హబీద్ రూ. 90 వేలు లంచం డిమాండ్ చేశారు. చేసిన పనులకు సంబంధించి బిల్లు కోసం ఇంజనీరింగ్ విభాగం కార్యాలయాల చుట్టూ తిరిగిన కాంట్రాక్టర్ సంజీవ చివరకు లంచం రూ. 80 వేలు ఇచ్చేందుకు ఒప్పుకుని తొలి విడత అడ్వాన్స్ గా రూ. 50 వేలు ఇవ్వడానికి అంగీకరించాడు. తర్వాత సదరు కాంట్రాక్టర్ సంజీవ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తనకు రావాల్సిన బిల్లు చెల్లింపుల కోసం ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం డీఈఈ, ఏఈఈల సతాయింపులను చెప్పాడు. దీంతో ఏసీబీ అధికారుల పథకం ప్రకారం కాంట్రాక్టర్ శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఏటూరునాగారంలోని ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం కార్యాలయానికి చేరుకున్నాడు. కార్యాలయంలో ఉన్న డీఈఈ నవీన్ కుమార్, ఏఈఈ హబీద్ కాంట్రాక్టర్ నుంచి లంచం రూ. 50 వేలు తీసుకుంటున్న సమయంలో అప్పటికే పథకం ప్రకారం మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డీఈఈ నవీన్ కుమార్, ఏఈఈ హబీద్ లను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఏటూరునాగారంలోని ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం కార్యాలయంలోనూ సోదాలు జరిపారు. మేడారం పనులు చేసిన ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఐటీడీఏ డీఈఈ, ఏఈఈ ఏసీబీ అధికారులకు పట్టుబడడం సంచలనం కలిగించింది. ఈ సంఘటనపై ఏసీబీ వరంగల్ డీఎస్పీ సుదర్శన్ రాత్రి వివరాలను వెల్లడించారు. డీఈఈ నవీన్, ఏఈఈ హబీద్ లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. లంచం పుచ్చుకుంటున్న డీఈఈ, ఏఈఈలను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకోవడం అవినీతి తిమింగలాల్లో గుబులు రేపింది.
సాయంత్రం 7 నుండి ఉదయం 6 గంటల వరకు విచారణ...
ఐటీడీఏ అధికారులపై జరిగిన ఏసీబీ దాడులు ఏజెన్సీలో కలకలం రెపాయి. ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డ ఏఈఈ హబీద్‌ఖాన్, డీఈఈ నవీన్ కూమార్ ను శుక్రవారం సాయంత్రం 7 నుండి శనివారం ఉదయం 6.30 గంటల వరకు ఏసీబీ అధికారులు ఐటీడీఏలోనే మకాం వేసి విచారణ కోనసాగించారు. విచారణ సమయంలో పలు కీలక విషయాలు బయటకి వచ్చాయని సమాచారం. విచారణ కోనసాగిన సమయం మొత్తం ఐటీడీఏను సుమారు 13 గంటలు ఏసీబీ అధికారులు కట్టుదిట్టం చేసి తమ అధ్వర్యంలో ఉంచుకోవాడం గమనార్హం. విచారణ జరిగిన సమయంలో ఇంజనీరింగ్ విభాగంలోని సిబ్బందిని బయటకి రాకుండా ఏ గదిలోని సిబ్బందిని అదే గదిలో కదలకుండా కట్టుదిట్టం చేసి దశల వారీగా బయటకి పంపించడం జరిగింది. శనివారం ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో పట్టుబడ్డ డీఈ నవీన్, ఏఈ హబీద్‌ఖాన్‌ను ఐటీడీఏ నుండి బయటకి తీసుకోచ్చి కోర్టుకు తరలించారు. ముందు ముందు పలు కీలక విషయాలు బయట పడనున్నట్లు సమాచారం.