Warangal: ఆ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోండి.. పోలీస్ కమిషనర్‌కు మంత్రి ఫోన్

by Ramesh Goud |
Warangal: ఆ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోండి.. పోలీస్ కమిషనర్‌కు మంత్రి ఫోన్
X

దిశ, వెబ్ డెస్క్: తప్పు చేసిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు. హనుమకొండ(Hanumakonda)లోని కుమార్ పల్లి మసీదు దగ్గర.. రోడ్డు దాటుతున్న షాహిద్ అనే బాలుడిని ఓ కానిస్టేబుల్(Constable) బైక్ తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై స్థానికులు కానిస్టేబుల్ ను ప్రశ్నించగా.. నేనేం కావాలని చేయలేదని, కావాలంటే కేసు పెట్టుకోండి అని దురుసుగా మాట్లాడి వెళ్లిపోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ కానిస్టేబుల్ పై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బాలుడికి గాయాలు అయ్యాయని కనీస మానవత్వం కూడా లేకుండా దురుసుగా ప్రవర్తిస్తాడా అని మండిపడ్డారు. ఈ విషయంపై వెంటనే వరంగల్ పోలీస్ కమిషనర్(Warangal Police Commissioner) అంబర్ కిషోర్ ఝా(Ambar Kishor Jha)కు మంత్రి కొండా సురేఖ ఫోన్ చేశారు. దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేగాక ప్రమాదంలో గాయపడ్డ బాలుడికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి సూచించారు.

Next Story