- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జియోలో వాయిస్ బ్రేక్ సమస్యకు కారణమిదే..
జియోలో నెట్ స్పీడ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఒక్కోసారి వాయిస్ కాల్స్ క్వాలిటీ సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా కాల్స్ కలవకపోవడంతోపాటు వాయిస్ బ్రేక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ సమస్య ఎందుకు వస్తుందో గుర్తిస్తే.. ఇకపై దానిబారినుంచి బయటపడొచ్చు.
వాయిస్ బ్రేక్..
ఇంట్లో, ఆఫీసులో వైఫై ఉండటం కామన్‌గా మారింది. 5జీ ఫోన్లలో వైఫై కాలింగ్ ఫీచర్ ఆటోమేటిక్‌గా ఎనేబుల్డ్ అవుతుంది. దీనివల్ల వాయిస్ కాల్స్ నాణ్యత మెరుగుపడిన విషయం వాస్తవమే. అయితే, ఈ ఫీచరే ఇప్పుడు జియో వినియోగదారులకు చుక్కలు చూపెడుతున్నాది. వైఫ్ కాలింగ్ ఆప్షన్ ఎనేబుల్డ్ ఫోన్ ఉన్న వినియోగదారులకు కాల్ డ్రాప్ సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి.
నెట్ సిగ్నల్స్ కాస్త తగ్గినా..
ఇంట్లో ఉన్నంత వరకూ కాల్స్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఇంటినుంచి బయటకు వైఫై సిగ్నల్స్‌కి కాస్త దూరంగా వెళ్తే.. అప్పుడు మొదలవుతుంది అసలు చిక్కులు. వైఫై సిగ్నల్స్ లేకపోతే కాల్స్ వాయిస్ బ్రేక్ అవుతూ చిరాకు పెడుతుంది. ఇక ఆఫీసులో అయితే, ఎక్కువమంది వైఫై వాడుతారు కాబట్టి.. లోడ్ ఎక్కువగా ఉన్నా వాయిస్ బ్రేక్ అవుతుంది. ఈ సమస్య నివారణకు వైఫై కాలింగ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేయాల్సిందే. లేదా ఆఫీసులాంటి చోట్ల వైఫైని ఆఫ్ చేయడం చేయాలి. కానీ, వైఫై కాలింగ్ ఆప్షన్ అవసరం మేరకే ఉపయోగిస్తే ఈ సమస్య రాదని టెక్ నిపుణులు చెప్తున్నారు.
వైఫై కాలింగ్ ఇలా డిసేబుల్ చేయండి
ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లగానే మొబైల్ నెట్ వర్క్ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో సిమ్1, సిమ్2 అని ఆప్షన్లు వస్తాయి. జియో సిమ్ పై క్లిక్ చేయగానే అందులో వైఫై కాలింగ్ అనే ఆప్షన్ కినిపిస్తుంది. దానిని ఆఫ్‌లో పెడితే సరిపోతుంది.