- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రేపు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లోకి విజయశాంతి.. ఇచ్చిన కీలక హామీ ఇదే..!

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి నెక్స్ట్ స్టెప్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎన్నికల ప్రచారం పీక్స్ స్టేజీలో ఉండగా బీజేపీని వీడిన రాములమ్మ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది. రేపు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే విజయశాంతితో మంతనాలు జరిపిన ఏఐసీసీ నాయకులు.. పార్టీలో చేరితే మెదక్ ఎంపీ స్థానంతో పాటు పార్టీలో సముచిత గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా బీజేపీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉన్న విజయశాంతి చివరకు నిన్న బీజేపీకి రాజీనామా చేశారు.
Next Story