- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA Kumbham : కాంగ్రెస్ చేసిన మంచిని చెప్పేందుకే విజయోత్సవాలు : ఎమ్మెల్యే కుంభం
దిశ, వెడ్ డెస్క్ : కాంగ్రెస్(Congress government) ఏడాది పాలనలో ప్రజలకు, రాష్ట్రాభివృద్ధికి చేసిన మంచిని చెప్పుకునేందుకే ప్రజా పాలన విజయోత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తుందని భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(Kumbham Anil Kumar Reddy)స్పష్టం చేశారు. ఏడాది కాలంలోనే 50 వేల ఉద్యోగాలు, రూ.18,000 కోట్లు రైతు రుణమాఫీ చేసిందని, 2లక్షల రుణమాఫీ కొనసాగిస్తుందని, దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు చేయలేదన్నారు. రైతుల కోసం రైతు భరోసాతో రూ. 7,625 కోట్లు అందించామని, రైతు బీమా రూ.1,455 కోట్లు, పంటల బీమా రూ.1,300 కోట్లు అమలు చేశామని, ఉచిత విద్యుత్ కు రూ.10,444 కోట్లు ఖర్చు చేసిందని చెప్పుకొచ్చారు. 2023-24 ధాన్యం కొనుగోలుకు రూ.10,547 కోట్లు, ఈ సీజన్ లో సన్న వడ్ల బోనస్ కు రూ. 5,040 కోట్లు వంటి ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు. మహిళలకు ఉచిత బస్సు, రూ.500లకే సిలిండర్, 200యూనిట్ల ఉచిత విద్యు్త్తు,10లక్షలు ఆరోగ్య బీమా అమలు చేశామన్నారు. మూసీ ప్రక్షాళన చేపట్టామని, స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తుందన్నారు. డైట్ చార్జీలను పెంచిందని గుర్తు చేశారు. త్వరలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. ఏడాదిలోనే ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన మేము విజయోత్సవాలు ఎందుకు చేసుకోకూడదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, రాష్ట్రాభివృద్ధిని విస్మరించి కుటుంబ పాలనతో రాష్ట్ర వనరులను దోచుకున్నారని అనిల్ కుమార్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి చేసిందేమి లేదని.. 7లక్షల కోట్లు అప్పులు చేశారని, ఫోన్ ట్యాపింగ్ లతో రాజకీయ నాయకులను, వ్యాపారులను, సినిమా హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశారని, ఆఖరికి భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా విన్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగుల ఉద్యోగ పరీక్షలను కూడా ప్రశ్నపత్రాల లీకులు, కోర్టుల్లో వివాదాల మయం చేశారని విమర్శించారు. అప్పులు తెచ్చి కూలిపోయే ప్రాజెక్టులు కట్టారని, మేం అలా చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలన నచ్చకే ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారన్నారు. ప్రజల కోసం ప్రజాప్రభుత్వం చేసిన మంచిని వారికి తెలియచెప్పాల్సిన బాధ్యత ఉందని, అందుకే ప్రజాపాలన విజయోత్సవాల్లో వారిని భాగస్వాములను చేస్తున్నామన్నారు.