ఎన్నికల వేళ కాంగ్రెస్ అధిష్టానికి VH కీలక సూచన

by GSrikanth |
ఎన్నికల వేళ కాంగ్రెస్ అధిష్టానికి VH కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంత రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సెక్యూలర్ అని అన్నారు. రాహుల్ గాంధీ సెక్యూలర్ సిద్ధాంతాలో పనిచేస్తున్నారని తెలిపారు. దేశానికి కాంగ్రెస్ మేనిఫెస్టో దిక్సూచి అవుతుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నా.. మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులు, కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని అధిష్టానానికి సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. కేంద్రంలో ఉన్న సపోర్ట్‌తో బీజేపీ నేతలు అత్యుత్సాహం చేస్తున్నారని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వారికి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని ఎద్దేవా చేశారు. రెండు సీట్లకే బీజేపీ పరిమితం కాబోతోందని జోస్యం చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed