SLBC Tunnel Update: ఆల్మోస్ట్ అక్కడ వరకూ వెళ్లిన ఆర్మీ బృందం

by Gantepaka Srikanth |   ( Updated:2025-02-25 16:35:21.0  )
SLBC Tunnel Update: ఆల్మోస్ట్ అక్కడ వరకూ వెళ్లిన ఆర్మీ బృందం
X

దిశ, వెబ్‌డెస్క్: SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్(Rescue Operation) ముమ్మరంగా కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ బృందాలు దాదాపు ప్రమాదం జరిగిన స్థలం వరకూ వెళ్లాయి. 10 మీటర్ల టన్నెల్‌లో 15 అడుగుల మేరకు బురదనీరు చేసుకోవడంతో ఇంకా ముందుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం టన్నెల్‌లోని బురదనీటిని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్యాస్ కట్టర్లతో బోరింగ్ మిషన్ భాగాలు కటింగ్ చేస్తున్నారు. మరోవైపు కన్నేయర్ బెల్టు పునరుద్ధరణకు ఇంజినీర్లు ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు నిత్యం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

కాగా, నాగర్ కర్నూల్ జిల్లా దోమల పెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌(SLBC Tunnel)లో 14 కిలోమీటర్ల లోపల పైకప్పు కూలిపోగా.. టన్నెల్‌లో ఎనిమిది మంది సిబ్బంది చిక్కుకుపోవటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అయితే.. అందులో చిక్కుకుపోయిన సిబ్బందిని రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, సింగరేణి రెస్క్యూ బృందాలతో పాటు హైడ్రా, ఇండియన్‌ ఆర్మీ, స్పెషల్‌ బెటాలియన్ల ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

మరోవైపు.. ప్రభుత్వం ఇంత కష్టపడి నిద్రహారాలు మాని రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంటే.. విపక్షాలు విమర్శలు చేయడం సరికాదని ప్రభుత్వ పెద్దలు మండిపడుతున్నారు. ఈ పరిస్థితి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కాంగ్రెస్ నేతలు అంటుంటే.. కాంగ్రెస్ నిర్లక్ష్యం కారణంగానే ఎనిమిది మంది కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.



Next Story

Most Viewed