- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
తెలంగాణకూ కేంద్రం నుంచి సాయం.. కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల పట్ల వివక్ష ఉండదని కామెంట్ చేసిన కేంద్ర సోషల్ జస్టిస్ మంత్రి రాందాస్ అథవాలే.. ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేసినట్లుగానే తెలంగాణకు కూడా సహకారం అందిస్తుందని నొక్కి చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, ప్యాకేజీలను తెలంగాణకు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణకు న్యాయం చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని, అందులో భాగమే జాతీయ రహదారుల మంజూరుతో పాటు నిర్మాణం, రైల్వే లైన్‌లు సాకారం చేయడం, కొన్నింటికి బడ్జెట్‌లో కేటాయింపు చేయడం అని పేర్కొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు నిధులురాలేదంటూ అప్పటి సీఎం కేసీఆర్ అనేక ఆరోపణలు చేశారని, కానీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వాటిని నమ్మలేదని, ఆ కారణంగానే బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిందని, పార్లమెంటులో ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయిందన్నారు.
ఏపీలో సైతం బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, పొత్తు ఫార్ములా పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలను ఇచ్చిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. అన్ని సెక్షన్ల ప్రజలకు సమ న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే తాజా కేంద్ర బడ్జెట్‌లో సోషల్ జస్టిస్ కోసం రూ. 1.84 లక్షల కోట్లను కేటాయించినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ప్రస్తావిస్తూ, ఏ, బీ, సీ డీ గ్రూపులుగా విభజించి రిజర్వేషన్‌లను ఇచ్చే అధికారాన్ని రాష్ట్రాలకు కట్టబెట్టిందని గుర్తుచేశారు. రాష్ట్రంలోని సోషల్ జస్టిస్ అంశాలపై సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జూన్ చివరి నాటికి రాష్ట్రం మొత్తం మీద 1,709 ఎస్సీ/ఎస్టీ కేసులు నమోదయ్యాయన్నారు. ఇందులో 45 హత్య కేసులే ఉన్నాయంటూ రాష్ట్ర అధికారులు వివరాలు ఇచ్చారని గుర్తు చేశారు.