- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాస్తు బాగోలేదని సచివాలయానికే రాలే.. కేసీఆర్‌పై కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సికింద్రాబాద్ సెగ్మెంట్ పరిధిలో ఆదివారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఎన్నడూ ప్రజలను, వాళ్ల సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు. వాస్తు బాగోలేదని సచివాలయానికి రాకుండా.. పదేళ్లు ఫామ్‌హౌస్ నుండే పాలన చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పదేళ్లు సమర్థవంతంగా పని చేశామని చెప్పారు. ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజలు బీజేపీనీ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానన్నారు.
బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రపంచంలో భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక దేశంగా అవతరించిందన్నారు. బీజేపీ మూడవ సారి అధికారంలోకి వస్తే అతిపెద్ద ఆర్థిక దేశంగా తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాటలు ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తు్న్నామన్నారు. ముస్లిం ఆడబిడ్డల మేలు కోసమే ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చామని స్పష్టం చేశారు. దేశ అభివృద్ధి కోసం మోడీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.