- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎంపీ ప్రశ్నకు తెలంగాణ సర్కారుపై మండిపడ్డ కేంద్రమంత్రి.. ఎంపీ రఘునందన్ ట్వీట్

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంటులో తాను అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ప్రహ్లద్ జోషి (Union Minister Prahlad Joshi) తెలంగాణ సర్కారుపై మండపడ్డారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) ట్వీట్ చేశారు. పార్లమెంటులో (Parliament) జరిగిన సన్నివేశాన్ని ట్విట్టర్ లో పోస్టు చేస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రఘునందన్ రావు తెలంగాణలో ప్రభుత్వ భూముల్లో సోలార్ విద్యుత్ తో పాటు ఇతర సహజ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై వివరణతో పాటు కేంద్రం ఇస్తున్న రాయితీల వివరాలు తెలియజేయాలని ప్రశ్నించారు.
దీనికి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇస్తూ.. సోలార్ పార్క్‌ల కోసం కేంద్రం ద్వారా విరివిగా నిధులు కేటాయిస్తున్నామని, ప్రభుత్వ భూములకే కాదు పీఎం kusum, పీఎం సూర్య ఘర్ లాంటి పథకాల ద్వారా ప్రజలకు సబ్సిడీలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే 2014 లో మోడీ ప్రధాని పదవిలోకి రాక ముందు 2.38 గిగా వాట్లు.. ఇప్పుడు 100 గిగ వాట్లు.. తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ ఉన్న పథకాలు అని, ఇప్పటికే ఇచ్చిన లక్ష్యాల్ని తెలంగాణ పూర్తి చేస్తే మరింత నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక రాష్ట్రాలలో ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా మేము సాయం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ కొన్ని రాష్ట్రాలు ఈ పథకాల్ని వాడుకోవడంలో విఫలం అవుతుండటమే దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కేంద్రం ఇస్తున్న పథకాల్ని వాడుకోవడం లేదని, సెప్టెంబర్ 2023లో తెలంగాణ ఏజెన్సీనీ మారుస్తామని చెప్పినా కేంద్రం ఒప్పుకున్నదని చెప్పారు. అక్టోబర్ 2024 లో tgredco ను కోరామని, పెండింగ్ PPA లను డిసెంబర్ లో పూర్తి చెయ్యాలని చెప్పిన కూడా పూర్తి కాలేదని అన్నారు. 500 మెగావాట్ల కోసం జనవరి 2021 లో కేటాయించినా కూడా ఎలాంటి పురోగతి లేదని, 4000 మెగా వాట్ల కోసం జూన్ 2024 లో సాంక్షన్ ఇచ్చామని, ఆరు నెలల తర్వాత ఎలాంటి పురోగతి లేకపోవడంతో 3000 మెగా వాట్లు రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపారు. EOI కోసం జనవరి లో ఎలాంటి LOS ఇవ్వలేదని, ఫిబ్రవరి 2025లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ల ద్వారా ఉత్పత్తి కోసం ప్రభుత్వ భూములను వాడుతామని రాష్ట్రం కొత్తగా కోరిందని అన్నారు.
ఇది పీఎం kusum పథకం కిందకి వస్తుందని, ఇది రైతుల కోసం ఏర్పాటు చేసిన పథకమని, రాత్రి కరెంట్ కోసం కాకుండా పగలు విద్యుత్ రైతులకు ఇవ్వాలని మోడీ కోరిక అని వివరించారు. ఇది రైతుల భూములలో మాత్రమే చెయ్యాలని నిబంధన ఉన్నదని, ఆ మేరకు తెలంగాణ సిద్ధంగా ఉంటే మేము సాంక్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అలాగే 2030 వరకు 500 గిగా వాట్ల సహజ విద్యుత్ ఉత్పత్తి కోసం కేంద్ర సర్కారు ప్రయత్నాలు చేస్తున్నదని, భారత్ ప్రపంచంలో అత్యధిక రెన్యూవబుల్ ఎనర్జీ (renewable energy) ఉత్పత్తి దేశాలలో మూడవ స్థానంలో ఉంది అని గర్వంగా చెప్తున్నామని అన్నారు. ఇక తెలంగాణ వరకు అన్ని పార్టీల ఎంపీలు కూడా తెలంగాణ సర్కారుతో మాట్లాడి ఈ పథకాల్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ రఘునందన్ విజ్ఞప్తి చేశారు.