- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఫిక్స్
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. వచ్చే నెల (మార్చి) 4వ తేదీన అమిత్ షా తెలంగాణకు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీ- బీజేపీ చేపట్టిన విజయ సంకల్పయాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 24వ తేదీన అమిత్ షా తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల స్టేట్ టూర్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో మార్చి 4న ఆయన తెలంగాణకు రానున్నారు. కాగా, తెలంగాణలో బీజేపీ 10 ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విజయ సంకల్ప యాత్ర చేపట్టింది.
ఈ నెల 16వ తేదీన బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో ఈ యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర కోసం బీజేపీ రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా విభజించింది. ఐదు క్లస్టర్లలో యాత్ర మొదలుపెట్టి చివరగా హైదరాబాద్‌లో ముగించనున్నారు. ఈ యాత్రలో స్టేట్ బీజేపీ అగ్రనేతలతో పాటు జాతీయ నాయకులు పాల్గొంటారు. విజయసంకల్ప యాత్ర మార్చి 4వ తేదీన ముగియనుంది. యాత్ర ముగింపు సభను భారీగా నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే యాత్ర క్లోజింగ్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.